ఇటీవలే పరభాషా నటీమణులకు కంపల్‌సరీగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలని అధ్యక్షుడు మురళీమోహన్ అందరికీ లెటర్లు పంపించారు. ఇదిలా ఉండగానే.. సమంతకు ఇలాంటి తాకీదు ఒకటి అందింది. నిర్మాతలకు డేట్స్ ఇచ్చే విషయంలో తేడా చేసిందని ప్రముఖనిర్మాత బెల్లంకొండ సురేష్ ఇటీవలే ఫిర్యాదు చేశాడు.
ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనూ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న 'ఈగ'లోను, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఎవడు, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా... బెల్లంకొండ సురేష్ నిర్మాతగా సిద్దార్థ్ హీరోగా నందినీరెడ్డి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించింది. దానికి అడ్వాన్స్ కూడా తీసుకుందిట.
కానీ సమంత ఈ సినిమాకు డేట్స్ ఫైనల్ చేయకపోవడంతో కోపంతో ఈ విషయాన్ని నిర్మాత 'మా' దృష్టికి తెచ్చాడు. దీంతో వారు సమంతను పిలిచి జోరుగా సాగుతున్న కెరీర్‌లో చాలా జాగ్రత్త ఉండాలని హితవు పలికారు. దీనికి వెంటనే స్పందించిన ఆమె "మా"కు వచ్చి తన వివరణ ఇచ్చుకుంది. ఆ వివరణ ప్రకారం ఆమె డేట్స్ చాలా లాగ్ కావడంతో... మళ్ళీ కథ మొదటకొచ్చింది. చివరికి ఏమవుతుందో చూడాలి.

Post a Comment