Pages

Sunday, 15 January 2012

‘పూలరంగడు’ అఫీషియల్ డీటేల్స్

కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ తాజా సినిమా ‘పూల రంగడు’ సినిమా విడుదలపై గత కొంత కాలంగా అయోమయ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు అయోమయానికి తెర దించుతూ దర్శక, నిర్మాతలు విడుదలపై అధికారిక ప్రకటన చేశారు. నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు వీర భద్రం చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ....‘ఈ నెల 18న ఆడియో, ఫిబ్రవరి 3న సినిమా రిలీజ్‌ చేస్తున్నాం. సునీల్‌ పూర్తిస్థాయిలో హాస్యం పండించిన సినిమా ఇది. ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి’ అన్నారు.

దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ ‘ ఇందులో కొత్త సునీల్‌ను చూస్తారు. ఈ చిత్రం సునీల్ కెరీర్‌లో పెద్ద హిట్ చిత్రంగా నిలిచిపోతుందన్న నమ్మకముంది’ అన్నారు. సునీల్ సరసన ఇషా చావ్లా హీరోయిన్ నాటిస్తున్నఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్‌రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపన, సినిమాటోక్షిగఫీ: ప్రసాద్ మురెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ : ఆర్ ఆర్ మూవీ మేకర్స్, ఎడిటింగ్ : గౌతం రాజు


No comments:

Post a Comment