Pages

Wednesday, 18 January 2012

మహేష్.. ఒక్క షాట్‌తోనే ఓకే చేసేస్తాడు: కాజల్ అగర్వాల్

బిజినెస్‌మేన్‌ చిత్రంలో నటించిన కాజల్‌ అగర్వాల్‌కు ఎక్కడకు వెళ్లినా మంచి ఫాలోయింగ్‌ ఉంటోందట. ఈ విషయాన్ని ఆమే చెబుతోంది. మహేష్ బాబుతో చేయడం చాలా ఆనందాన్ని కల్గించిందట. మహేష్‌ నుంచి ఎంతో నేర్చుకున్నాననీ, పూరీ జగన్నాథ్‌ తనను రికమండ్‌ చేసినదుకు చాలా థ్యాంక్స్‌ అంటున్న కాజల్‌ అగర్వాల్‌... చెప్పిన సంగతులు.

బిజినెన్‌మేన్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంది?
ఈ సినిమా పెద్ద హిట్‌ అయింది. అందరూ చాలా కష్టపడి పనిచేశారు. ఎక్కడకు వెళ్లినా అంతా పెయింటర్‌ అని పిలుస్తున్నారు. ఈ సినిమాలో నేను పెయింటర్‌ను.

జీవితంలో ఎప్పుడైనా పెయింటింగ్‌ వేశారా?
చిన్నప్పుడే పెయింటింగ్‌ పట్ల ఆసక్తి ఎక్కువ. చాలా చిత్రాలు వేసేదాన్ని... డోర్‌ కర్టెన్స్‌ కూడా పెయింటింగ్‌లా వేసేదాన్ని. మా అమ్మకు విసుగెత్తి ఇక చాల్లే అనేది. గోడలకు, కర్టెన్స్‌ చాలా చక్కగా బొమ్మలు వేసేదాన్ని.

చిత్ర క్యారెక్టర్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంది?
ఆ పాత్రలో రెండు షేడ్స్‌ ఉన్నాయి. హీరోపై లవ్‌, విసుగు కల్గించే సన్నివేశాలతో కూడిన క్యారెక్టర్‌. ఎమోషన్స్‌ చక్కగా పలికించేందుకు ఉపయోగపడింది.

మహేష్‌ బాబుతో నటించడం ఎలా అనిపించింది?
మంచి మనిషి. తన పనేదో తను చూసుకునేవాడు. సెట్లోకి వస్తే సీన్‌ మీద కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తాడు. ఒక్క షాట్‌తోనే ఓకే అవుతుంది.

కాజల్‌ ఇష్టపడి లిప్‌కిస్‌ ఇచ్చిందనీ పూరీ చెప్పారు? బయట పేరు కూడా బాగా వచ్చింది?
ఎందుకంత హైప్‌ చేస్తున్నారో అర్థంకాదు. అది కథలో భాగంగా ఒకచోట అలా ఉంది. చేయాలి అని పూరీ అడిగారు. అందులో పెద్దగా తప్పు అనిపించలేదు. అందుకే చేస్తానని చెప్పాను.

రియల్‌ లైఫ్‌లో రిచ్‌ పర్సనా, రోడ్‌సైడ్‌ వాడిని లవ్‌ చేస్తారా?
బిజినెస్‌మేన్‌లో నాకంటే నా పక్క పాత్ర రిచ్‌ పర్సన్‌ను లవ్‌ చేసేది. నేను కాదు. రియల్‌ లైఫ్‌లో మాత్రం అటు రిచ్‌కాదు, రోడ్‌సైడ్‌ కాకుండా మిడిల్‌ పర్సన్‌‌ను లవ్‌ చేస్తాను.

సినిమా చూశాక ఫ్యామిలీనుంచి ఎలా స్పందన లభించింది?
ఫ్యామిలీ మెంబర్లు, ఫ్రెండ్స్‌ చాలా బాగుందన్నారు. క్యారెక్టరైజేషన్‌ మలిచిన విధానం పూరీ బాగా చేశారని ప్రశంసించారు. డిఫరెంట్‌ లుక్‌లో ఉన్నావని కాంప్లిమెంట్‌ ఇచ్చారు.

సినిమాను ఎక్కడ చూశారు?
ముందుగా దుబాయ్‌లో చూశాను. రెండోసారి ముంబైలో చూశాను. రెండు మాస్‌ థియేటర్లు.. రెస్పాన్స్ అదుర్స్‌. బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

పోకిరి, బిజినెస్‌మేన్‌లలో ఏ సినిమా మీకు నచ్చింది?
పోకిరి కంటే బిజినెస్‌మేన్‌లో మహేష్‌ ఔట్‌స్టాండింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఉంది. కామెడీ కూడా తనే చేశాడు.

హిందీలో ఏ హీరో అయితే ఈ సినిమాకు బాగుంటుందని భావిస్తున్నారు?
నా మైండ్‌లో ఎవరూలేరు. ఓన్లీ ఒన్‌ మేన్.. దటీజ్ మహేష్‌... హిందీలో చేస్తే బాగుంటుంది.

డ్రీమ్‌రోల్స్‌ ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయి. చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మూడు చెబుతాను. ఫుల్‌ కామెడీ సినిమా చేయాలి. యాక్షన్‌ మూవీ చేయాలి. అనార్కలి లాంటి క్యారెక్టర్‌ చేయాలి. ఇవి తీరాక తర్వాత ఏం చేయాలో చెబుతాను.
బిజినెస్‌మేన్‌-2 లో మీరు నటిస్తారా?
నేను ఈ రోజే పేపర్లో చూశాను. సీక్వెల్‌ చేస్తున్నారని... పూరీగారు అడిగితే తప్పకుండా చేస్తాను.

బిజినెస్‌మేన్‌ తర్వాత మీకు కొత్త ఆఫర్లు ఏమైనా వచ్చాయా?
ఇంతవరకు రాలేదు. గతంలో కమిట్‌ అయిన సినిమాలే చేస్తున్నాను.

సింగం తర్వాత హిందీలో ఎలాంటి అవకాశాలు వచ్చాయి?
మార్చిలో కొత్త సినిమా చేస్తున్నాను. సింగం తర్వాత మంచి ఆఫర్లే వచ్చాయి. కానీ ఇక్కడే తెలుగులో రెండు సినిమాలు కమిట్‌ అయ్యాను.

ఏయే చిత్రాలు చేస్తున్నారు?
వినాయక్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటించే సినిమాతో పాటు తారక్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్నాను అని చెప్పారు.

No comments:

Post a Comment