సునీల్ హీరోగా నటించిన సినిమా ‘పూలరంగడు’. ‘ప్రేమకావాలి’ భామ ఇషాచావ్లా కథానాయిక. ‘అహ నా పెళ్లంట’ ఫేం వీరభద్రమ్ దర్శకుడు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో మాక్స్‌ఇండియా ప్రొడక్షన్స్‌లో కె.అచ్చిరెడ్డి నిర్మించారు. ఈ నెల 15న ఆడియో, ఫిబ్రవరి 3న సినిమా రిలీజవుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ ‘‘చిత్రీకరణ పూర్తయింది. మరోవైపు నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాటలు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం. సినిమా ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా 450థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. సునీల్ ‘అందాలరాముడు’, మర్యాదరామన్న’ చిత్రాల్లో కంటే భిన్నంగా కనిపిస్తాడు. డాన్సులు ఇరగదీశాడు. పతాకసన్నివేశం థ్రిల్‌నిస్తుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అన్ని వర్గాలను అలరించే ఈ చిత్రం సునీల్ కెరీర్‌కి పెద్ద విజయాన్నిస ు్తంది’’ అన్నారు. కోట శ్రీనివాసరా వు, అలీ, ప్రదీప్‌రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృధ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తది తరులు నటించారు. కెమెరా: ప్రసాద్ మురెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: గౌతంరాజు, మాటలు: శ్రీధర్ సీపన, కళ: నాగేంద్ర, కథ- కథనం- దర్శకత్వం: వీరభద్రవదం
Home »
» ఫిబ్రవరి 3న పూలరంగడు
Post a Comment