రామ్‌చరణ్ హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఎవడు’. రెగ్యులర్ షూటింగ్ ఈనెల 23నుంచి జరుగుతుంది. సమంత కథానాయికగా నటిస్తోంది. మరోనటి బాలీవుడ్‌లో జెస్సీగా పేరుపొందిన జాన్సన్ మరో కథానాయిక. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ వంశీపైడిపల్లి, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు. మదరాసిపట్నం ఫేమ్ అమీజాక్సన్ నటిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది. వంశీ మాసంస్థలో హ్యాట్రిక్ విజయాన్ని సాదించేలా చర్యలు తీసుకుంటున్నాడు. దేవీశ్రీప్రసాద్ సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. యాక్షన్‌ని, వినోదాన్ని సమపాళ్లలో అందిస్తున్నాం. ఎన్నో రకాల థ్రిల్స్ ఇందులో వుంటాయి. ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది అన్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
Post a Comment