Pages

Tuesday, 10 January 2012

రోజుకి 20 సిగరెట్లు ఊదేస్తున్న హీరోయిన్

తెలుగు, ఇతర దక్షిణాది భాషా చిత్రాల్లో సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న మధుశాలినిది హైదరాబాద్‌. ‘అందరివాడు’ చిత్రంతో ప్రత్యేకపాత్రలో కనిపించి ఎంట్రీ ఇచ్చిన మధుశాలిని ‘కితకితలు’ చిత్రంలో నరేష్‌తో కలిసి నటించింది. ఆ తర్వాత అంతగా గుర్తింపులేని పాత్రలలో నటించిన మధుశాలినికి అవకాశం అనుకోకుండా బాలీవుడ్‌ రూపంలో తట్టింది.దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తాను బాలీవుడ్‌లో రూపొందిస్తున్న ‘డిపార్ట్‌మెంట్‌’ చిత్రంలో మధుశాలిని గ్యాంగ్‌స్టర్‌ పాత్రను పోషిస్తోంది. రౌడీ లేడీ ఆటిట్యూడ్‌తో సిగరెట్లు తాగుతూ కనిపిస్తుంది మధుశాలిని. సినిమా షూటింగులో భాగంగా రోజుకు 20 సిగరెట్లు ఆమెతో తాగిస్తున్నాడట దర్శకుడు రాంగోపాల్‌వర్మ.
ఈ విషయమై మధుశాలిని మాట్లాడుతూ..‘సిగరెట్‌ కంపు అంటే నాకు అస్సలు పడదు, కానీ షూటింగ్‌ సమయంలో పాత్ర డిమాండ్‌ మేరకు దాదాపు 20 సిగరెట్ల వరకు తాగాల్సి వస్తోంది. నటించడం కంటే ఇలా సిగరెట్లు తాగడమే చాలా కష్టంగా ఉంది’ అంటోంది మధుశాలిని. రామ్‌గోపాల్‌వర్మకు, తనకు మధ్య ఎఫైర్‌ ఉందంటూ వస్తున్న వార్తలను మధుశాలిని ఖడించారు. మా ప్రొఫెషన్‌లో భాగంగా సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఇలా ఎఫైర్‌ అంటగడతారా? అంటూ మండి పడుతోంది. ‘డిపార్టుమెంట్‌’ చిత్రంలో మధు శాలినితో పాటు, రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. సంజయ్‌ దత్‌, అమితాబ్‌ బచ్చన్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

No comments:

Post a Comment