Pages

Wednesday, 18 January 2012

ఏప్రిల్‌లో ‘ఆకాశ్ – 2′: కపిల్ సిబల్

ఆకాశ్ టాబ్లెట్ పీసీని మరింత అభివృద్ధి చేసి ఆకాశ్-2 గా ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విడుదల చేసిన ఆకాశ్ నాణ్యతపై సందేహాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశ్ ట్యాబ్లెట్‌కున్న భారీ డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ మంది ఉత్పత్తిదారులు అవసరమని కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ వెల్లడించారు. ఆకాశ్ తయారీకి కావలసిన మార్గదర్శకాలను వారికి సూచించామని… ఈ క్రమంలో వినియోగదారుల నుంచి వచ్చిన పలు సూచనలను పరిగణనలోకి తీసుకుంటునట్టు ఆయన తెలిపారు. సమస్యలను పరిష్కరించగలమన్న ఆశాభావం సిబల్ వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment