టాలీవుడ్‌లో తమన్నా గ్లామర్ పంట పండిస్తోంది. టాలీవుడ్‌లో సూపర్ ఆఫర్లతో అదరగొడుతున్న తమన్నాకు.. కోలీవుడ్ సినిమాలు కరువయ్యాయట. టాలీవుడ్‌లో వీపు అందాన్ని, స్కిన్ షోకు ప్రాధాన్యమిస్తూ గ్లామర్‌తో ఓ ఊపు ఊపుతున్న తమన్నాకు కోలీవుడ్ ఛాన్సులు మాత్రం రోజు రోజుకి తగ్గుతున్నాయని సినీ జనం కోడైకూస్తోంది.
ఇటీవల బిజీ షెడ్యూల్ కారణంగా కోలీవుడ్ ఛాన్సులు వద్దని చెప్పిన తమన్నాకు.. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకులు కాల్షీట్ ఇవ్వకూడదని డిసైడ్ చేసుకున్నారట. కోలీవుడ్‌లో బిజీ షెడ్యూల్ కారణంగా సినిమాలు చేయనని చెప్పిన తమన్నా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో నటిస్తోంది. ఇందులో తమన్నా రిపోర్టర్‌గా కన్పించనుంది.
కాగా రచ్చలో వానా వానా వెల్లువాయెలో గ్లామర్‌గా కనిపించిన తమన్నా.. రాంబాబు సినిమాలో మాత్రం పూర్తిగా కప్పేసుకునే కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తోందట. రాంబాబులో తమన్నా గ్లామర్ పంట పండించకపోవడం అభిమానులకు నిరాశేనని సినీ జనం అంటున్నారు. ఒకవేళ సాంగ్స్‌లోనైనా తమన్నా అందాలను ఆరబోస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
Post a Comment