నయనతారతో లవ్వాట ముగిసింది. ఇక కొత్త గర్ల్ ఫ్రెండ్ వేటలో పడ్డాడు కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా. కోలీవుడ్, టాలీవుడ్‌ను పక్కనబెట్టి ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసిన ప్రభుదేవా కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ని పట్టేశాడు. ఆమె ఎవరో కాదు.. దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. నయనతో ప్రేమాయణం ముగిసిన తర్వాత రెండు వారాలు ఒంటరిగా ఉండిన ప్రభుదేవాకు అంతలోపు సోనాక్షితో లవ్వాట మొదలెట్టాడని సినీ వర్గాల్లో టాక్.
బాలీవుడ్ సినిమాల కోసం పనిచేస్తున్న ప్రభుదేవాకు సోనాక్షి సిన్హా అన్ని విధాలా సహాయం చేస్తుందట. షాపింగ్ చేయాలంటే ప్రభుదేవాకు సోనాక్షినే హెల్ఫ్ చేస్తుందట. లేటెస్ట్‌గా ఓ మై గాడ్ సినిమాలో ప్రభుదేవా, సోనాక్షి సిన్హాలు కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు కొరియోగాఫ్ర్ ప్రభుదేవా అందించారు.
ఇంకా సోనాక్షికి ప్రభుదేవానే డ్యాన్స్ నేర్పించాడు. రౌడీ రథోర్, జోకర్, ఓ మై గాడ్ వంటి చిత్రాల్లో సోనాక్షి, అక్షయ్ కుమార్‌లు కలిసి నటిస్తున్న సోనాక్షి ప్రభుదేవాకు సన్నిహితంగా ఉండటం ఉందట. దీన్ని చూసిన పలువురు సోనాక్షికి యంగ్ హీరోలతో నటించే ఆలోచనే లేనట్లుందని చెవులు కొరుక్కుంటున్నారట. మరి ప్రభుదేవాతో సంబంధాలను సోనాక్షి ఎన్ని రోజులు కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందే.!
Post a Comment