పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడివిడిగా ఉంటున్నారని గత కొంత కాలంగా రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రూమర్లకు తెర దించుతూ పవన్‌తో పాటు వచ్చిన రేణు రామ్ చరణ్ వివాహ వేడుకల్లో పాల్గొంది. చిరంజీవి తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఇచ్చిన విందు కార్యక్రమంలో కూడా రేణు సందడి చేసింది.
ఇక రామ్ చరణ్-ఉపాపసన పెళ్లి ఈ నెల 14న అంగరంగ వైభవంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో సంగీత్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
అల్లు అర్జున్, తమన్నా, శ్రియ మరియు ఇతర బంధు మిత్రులు డాన్సు చేయ్యబోతున్నారని, అలాగే కమెడియన్ అలీ ‘ కజి రారే ‘ పాటకు డాన్సు చేయ్యబోతున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
చిరంజీవి మనవరాలికి నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో గాయాలు కావడంతో సంగీత్ సెర్మనీలో సందడి కరువైందని, అంతా కలిసి అపోలో ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. ఎన్నో అంచనాలతో, భారీ ఏర్పాట్లతో సిద్ధం అవుతున్న చెర్రీ పెళ్లి వేడుకలో ఇలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోవడం ఇటు అభిమానులను కూడా నిరాశ పరుస్తోంది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment