పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. పవర్ స్టార్ ఈ చిత్రంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు.
తాజాగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్ర యూనిట్ సభ్యుల నుంచి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. పవర్ కళ్యాణ్ బలవంతం వల్లనే పూరి జగన్నాథ్ హైదరాబాద్‌లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుపాలని నిర్ణయించుకున్నాడట. వాస్తవానికి పూరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆయా లొకేషన్లు అత్యవసరం అయితే తప్ప షూటింగ్ జరుపడానికి ఇష్టపడరు.
ఎందుకని ఆరా తీస్తే... హైదరాబాద్‌లో ఉంటే పూరి చాలా డిస్ట్రబ్ అవుతారని ఆయన సన్నిహితులు అంటున్నారు. పూరి అంటే ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ దర్శకుడు. చాలా మంది నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయడానికి క్యూలో ఉన్నారు. హైదరాబాద్‌లో ఎక్కడ షూటింగ్ జరిగినా.....ఎవరో ఒక నిర్మాత వచ్చి మా బ్యానర్లో ఓ సినిమా తీయాలని ఇబ్బంది పెడుతుంటారట. హైదరాబాద్ బయట అయితే వాళ్ల డిస్ట్రబెన్స్ ఉండదు కాబట్టి ఎక్కువగా హైదరాబాద్ బయటనే షూటింగులకు ఆసక్తి చూపుతుంటాడట పూరీ.
అయితే పవర్ స్టార్ మాత్రం అవసరం అయితే తప్ప బయటి లొకేషన్లలో షూటింగు పెద్దగా ఇష్ట పడరు. ఆయన ఎక్కువగా ఇంటికి దగ్గర్లోనే ఉండటానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ మేరకు పూరి జగన్నాథ్‌పై ఒత్తిడి తెచ్చి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని హైదరాబాద్‌లోనే జరుపడానికి పూరిని ఒప్పించాడట. ఇకపై ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగనుంది. పాటల చిత్రీకరణ మాత్రం విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారు.
గతంలో పవన్-పూరి కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి' చిత్రం మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఇటు అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మరో వైపు పవన్ గబ్బర్ సింగ్, పూరి బిజినెస్ మేన్ చిత్రాలు భారీ విజయం సాధించడం కూడా తాజాగా ఈ చిత్రం పై అంచనాలు ఎక్కువ అవడానికి మరో కారణం.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment