ప్రస్తుతం చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవిని తెరకెక్కించేందుకు హీరోయిన్ల వేటలో ఉన్నారట. తొలుత అరుంధతి అనుష్కను కదిలిస్తే ఆమెకు నిప్పు గుర్తుకు వచ్చి తర్వాత చూద్దాం అంటూ మెల్లిగా జారుకున్నదట. ఆ తర్వాత ఆయన శ్రీరామరాజ్యం సీత నయనతారను సంప్రదించారట. ఆమెకు కూడా ఎవరో నిప్పు గురించి చెబితే, రుద్రమదేవికి నేను సరిపోనేమోనంటూ తప్పించుకున్నదట.
వీళ్లద్దరూ మొండిచేయి చూపించేసరికి ఇప్పుడు గుణశేఖర్ పాలపిల్లపై తన దృష్టిని కేంద్రీకరించాడట. సబ్జెక్టు వినిపించాడట. ఐతే ఇప్పుడిప్పుడే గ్లామర్ హీరోయిన్ గా రేసులో ముందుకు దూసుకుపోతున్న తమన్నా ఒప్పుకుంటుందో లేదోమరి.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment