Home »
Telugu-Version
» "ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా" ఆడియోలో మోహన్ బాబు "అరిస్తే.. కరుస్తా"
"ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా" ఆడియోలో మోహన్ బాబు "అరిస్తే.. కరుస్తా"
ఆడియో ఫంక్షన్లంటేనే ఇప్పుడు ఓ గందరగోళంగా మారిపోయాయి. సినిమాను హైప్ చేసేందుకు వేదికలుగా మారిపోయాయి. ఈ ఆడియోల్లో సినిమా హీరోలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ వ్యవహారాన్ని ఘాటెక్కించిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా ఊ కొడతారా ఉలిక్కిపడతారా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా హైదరాబాదులోని శిల్పకళా వేదికలోనూ ఇదే జరిగింది. ఈ చిత్రంలో యువరత్న బాలకృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. దీంతో ఆయనను కూడా ఆడియోకు ఆహ్వానించారు. అయితే ఆడియో కార్యక్రమానికి వచ్చిన అభిమానులు బాలకృష్ణ కోసం అరవడం మొదలెట్టారు.అంతే... మంచు మోహన్ బాబుకు చిర్రెత్తుకొచ్చింది. మైకు అందుకుని అభిమానులపై ఇంతెత్తున లేచారు. నందమూరి హీరోలంటే తనకూ అభిమానముందనీ, అంతమాత్రాన గొడవ చేస్తే ఊరుకోననీ, బాలకృష్ణ వచ్చేవరకూ బుద్ధిగా కూచోవాలని సూచించారు. అంతేగానీ "అరిస్తే.. కరుస్తా.." అన్న రేంజ్‌లో మండిపడ్డారు. దాంతో అభిమానులంతా ముఖం ముడుచుకుని కూచున్నారు. ఆఖరికి యాంకరింగ్ చేసేవారు కూడా ఆట్టే పెద్దగా మాట్లాడాలంటే భయపడినట్లు కనబడ్డారు.
Post a Comment