అల్లరి నరేష్ యముడ్ని కంటతడిపెట్టించే సినిమా మొదలైంది. టైటిల్‌పెట్టని ఈ సినిమా రామోజీ ఫిలింసిటీలో బుధవారంనాడు ప్రారంభమైంది. చంటి అడ్డాల నిర్మాత కాగా, ఇ. సత్తిబాబు దర్శకుడు. నాయకా నాయికలపై చిత్రించిన ముహూర్తపుషాట్‌కు డా|| డి. రామానాయుడు క్లాప్ కొట్టగా, నిర్మాత తనయుడు పృథ్వీ అడ్డాల కెమేరా స్విచ్చాన్‌చేశారు. దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు సత్తిబాబు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి వెంకటేశ తర్వాత ఈ బేనర్‌లో చేస్తున్న రెండవ సినిమా ఇది. నరేష్‌తో 'నేను', 'బెట్టింగ్ బంగార్రాజు' సినిమాలకు దర్శకత్వం వహించాను. ఇది మూడవది. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందిస్తున్నాం. ఇంతవరకూ యముడు కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు విజయం సాధించాయి.
ఈ చిత్రంలో నరేష్ వైవిధ్యంగా కన్పిస్తాడు. హాస్యం నుంచి కంటతడిపెట్టించే పాత్రను చేస్తున్నాడు. సాక్షాత్తూ యముడికే కన్నీళ్ళు తెప్పించే పాత్ర అది. ఈ షెడ్యూల్ మే వరకు కొనసాగుతుంది. హీరో తల్లిగా, యముని భార్యగా ద్విపాత్రల్లో రమ్యకృష్ణ నటిస్తున్నారు. యముడి సెట్‌ను ఇక్కడే చిత్రిస్తున్నాం. యమలోకం, ఇంద్రలోకం.. వంటి సెట్లు వేయనున్నాం' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ- మా బేనర్‌లో 9వ సినిమా ఇది. ఐదేళ్ళ గ్యాప్ తర్వాత చేస్తున్నాం. సోషియో ఫాంటసీకి చక్కని వినోదం జోడించి తీస్తున్నాం. ఇదేబేనర్‌లో సత్తిబాబుని పరిచయం చేశాం. ఇందులోకంప్యూటర్ గ్రాఫిక్స్ కీలకం. వాటికోసం మూడు నెలలుగా శ్రమించాం. సినిమాలో మొత్తం 12 సెట్‌లు వేయనున్నాం. ఈ సృష్టి ఇలానే ఎందుకుంది? అని యముడే కంట తడిపెట్టే సన్నివేశాలుంటాయి' అని చెప్పారు.
నరేష్ మాట్లాడుతూ, గంటన్నర సేపే గ్రాఫిక్స్‌తో అలరించే చిత్రమిది. మొగ్గురు మొనగాళ్ళులోని 'అత్త అత్తమ్మ కూతురా..' పాటను రీమిక్స్ చేస్తున్నాం. రమ్యకృష్ణ నాతో స్టెప్పులేస్తారు' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె. రవీంద్రబాబు, సంగీతం: కోటి, కళ: కిరణ్‌కుమార్, కథనం, దర్శకత్వం: ఇ. సత్తిబాబు.

Post a Comment