అజిత్ హీరోగా 2007లో వచ్చిన ‘బిల్లా’ సినిమా అప్పట్లో తమిళనాట భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో అజిత్ స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. తాజాగా ఈచిత్రానికి సీక్వెల్‌గా ‘బిల్లా 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చక్రి తోలేటి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈచిత్రం ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్‌లో ఉంది. ఈచిత్రం మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పార్వతి ఓమన కుట్టన్, బ్రూనా అబ్దుల్లా ఈ చిత్రంలో లీడ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మీనాక్షి దీక్షిత్, గాబ్రియేలా బెర్జాంటె ఈచిత్రంలో ఐటం సాంగుల్లో నర్తిస్తున్నారు.
బిల్లా చిత్రాన్ని తెలుగులో ప్రభాస్ హీరోగా రీమేక్ చేశారు. అయితే తమిళ బిల్లా రేంజ్ లో తెలుగు బిల్లా ఆడలేదు. అయితే ప్రభాస్ యాక్టింగ్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తాజాగా తెలుగులో బిల్లా 2 ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ నుంచి వెలువడింది. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం రెబల్ చిత్రంలో నటిస్తున్నాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో ‘వారధి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ప్రేక్షకులు, అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్ మొదలు కానుంది.

Post a Comment