.
Home » » శేఖర్ కమ్ముల చిత్రంతో అక్కినేని అమల రీఎంట్రీ

శేఖర్ కమ్ముల చిత్రంతో అక్కినేని అమల రీఎంట్రీ

Written By Hot nd spicy on Tuesday, 10 April 2012 | 09:24

1992లో నాగార్జునను పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పిన అక్కినేని అమల మళ్లీ ల్యాంగ్ గ్యాప్ తర్వాత వెండి తెరపై మెరవనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో అమల ఒక కీలకమైన పాత్ర పోషించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్రంలోని ఆమె పాత్ర కథను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఈ వేసవిలో రిలీజవుతోంది. చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న అమల శేఖర్ కమ్ముల చెప్పిన పాత్రకు ఎగ్జైట్ అయి నటించటానికి ఒప్పుకుందని తెలుస్తోంది. ఆమె సపోర్టివ్ మదర్ గా ఈ చిత్రంలో కనిపించనుందని తెలుస్తోంది.

గతంలో శివ, ఆగ్రహం, రక్తతిలకం, కిరాయిదాదా, పుష్పక విమానం, చినబాబు, నిర్ణయం, ఘర్షణ, రాజావిక్రమార్క, అగ్గిరాముడు వంటి చిత్రాల్లో నటించిన అమల వివాహం అనంతరం నటనకు బ్రేక్ వేసారు. ఆ తర్వాత గృహిణిగా, ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’ సంస్థ అధ్యక్షురాలిగా తన సేవలను కొనసాగిస్తూ వచ్చారు. జంతు సంరక్షకురాలుగా తన పూర్తి సమయాన్ని అంకితం చేస్తూ వచ్చిన అమల ఇలా హఠాత్తుగా మళ్లీ వెండితెరపై కన్పించాలనుకోవడం ఆమె అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ఆనందాన్ని కలిగిస్తోంది.

'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' విషయానికి వస్తే... అందరూ కొత్త వాళ్లతో ఆయన రూపొందించే ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంభందించి ఓ స్టిల్ కానీ,టీజర్ కానీ విడుదల చేయకపోయినా మంచి క్రేజ్ ఉంది. ఈ వేసవి కానుకగా రాబోతున్న ఈ చిత్రంలో శ్రీయ హీరోయిన్ గా నటిస్తున్నారు. మిగతా పాత్రల్లో అందరూ కూడా నూతనతారలే నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం విషయమై శేఖర్...మాట్లాడుతూ..లీడర్‌ తరవాత ఎలాంటి కథ చేయాలి? అని ఆలోచించాను. మళ్లీ 'ఆనంద్‌', 'హ్యాపీడేస్‌'లాంటి సినిమా కావాలి అనిపించింది. వాటిలో జీవితం గురించి చెప్పాం. ఆ అనుభూతుల్ని మరోసారి చూపిద్దాం అనిపించింది. స్టార్స్‌ తో సినిమా తీయొచ్చు. కానీ ఈ కథకి కొత్తవాళ్లయితే బావుంటుంది. అందుకే ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల కోసం అన్వేషిస్తున్నాం. సిక్స్‌ప్యాక్ ‌లూ, ప్రపంచ సుందర్లూ అక్కర్లెద్దు. కథకు సరిపడేలా సహజంగా ఉంటే చాలు అన్నారు.ఇక ఈ చిత్రం కూడా యువతరాన్ని టార్గెట్ తీసారని తెలుస్తోంది. ఇక మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే శఖరే కమ్ముల ఈ తాజా చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో అమల పాత్రను ఎంత బ్యూటిఫుల్‌గా మలిచారో తెలియాలంటే తెరమీద చూడాల్సిందే.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger