చెన్నయ్ చిన్నది త్రిష ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘దమ్ము’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా ‘దమ్ము’ టీంకు వీడ్కోలు పలికే క్రమంలో హీరోయిన్ త్రిష ఇటీవల కంట తడి పెట్టింది. దీంతో జూ ఎన్టీఆర్, దర్శకుడు బోయపాటితో పాటు యూనిట్ సభ్యులంతా షాక్ అయ్యారు.
త్రిష ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించింది. ఎప్పుడు షూటింగ్ అయిపోయినా సంతోషంగానే ఆయా సినిమాల యూనిట్ సభ్యులకు వీడ్కోలు పలికేది. అయితే ‘దమ్ము’ సినిమా పూర్తయిన సందర్భంగా ఎందుకు అలా ఏడ్చింది? ఈ విచిత్ర ప్రవర్తన వెనక కారణం ఏమిటి? జూ ఎన్టీఆర్‌ను విడవలేక విరహమా? లేక ఇకేమైనా కారణం ఉందా? అనేది అంతు పట్టడం లేదు.
ఆ మధ్య నయనతార కూడా శ్రీరామరాజ్యం సినిమా షూటింగ్ పూర్తయిన సందర్బంగా కన్నీళ్లు పెట్టింది. అప్పుడు ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమాయణంలో మునిగి ఉన్న ఆమె అతన్ని పెళ్లి చేకోవాలనే ఆలోచనతో ఇక సినిమాల్లో నటించను అనే బాధతో కంట తడి పెట్టింది. ఆ తర్వాత నయనతార ప్రభుదేవాకు దూరం అవ్వడం, మళ్లీ సినిమాల్లోకి రావడం..అది వేరే విషయం.
కాగా...అప్పుడు నయనతార ఏడుపు దేశ వ్యాప్తంగా మీడియాలో చర్చనీయాంశం అయింది. భారీగా పబ్లిసిటీ వచ్చింది కూడా. తాజాగా త్రిష కూడా తన పబ్లిసిటీ పెంచుకోవడానికే ‘దమ్ము’ సినిమాలో షూటింగ్ పూర్తయిన తర్వాత వీడ్కోలు కార్యక్రమంలో అలా ఏడ్చిందని కొందరంటున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment