యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాజా సినిమా ‘దమ్ము’ శాటిలైట్ రైట్స్‌కు దిమ్మ దిరిగే రేటు పలికింది. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ‘జీ తెలుగు’ ఛానల్ దమ్ము శాటిలైట్ రైట్స్ రికార్డు స్థాయిలో రూ. 6.6 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో బంపర్ ప్రైస్ దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరో ‘దమ్ము’ దుమ్ము రేపుతుండటంపై ఆనందం వ్యక్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
త్రిష, కార్తీక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రొమాన్స్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వీటిలో ఒక పాత్రలో కోర మీసంతో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఫ్యాక్షనిస్టు పాత్రలో ఫాదర్ గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కుమారుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడని సమాచారం.
ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దర్శకుడు ఈ చిత్రాన్ని ఫుల్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా అభిమానులకు పూర్తి విందు చేసేలా రూపొందిస్తున్నారు.

Post a Comment