ఇప్పటివరకూ బాలీవుడ్ ఆడియో ఫంక్షన్లే చవకబారుగా మారిపోయాయని అనుకుంటున్నారు. ఇపుడు టాలీవుడ్ ఆడియో కార్యక్రమాలు కూడా 'పెంట పెంట' అవుతున్నాయి. ఇదే మాటను జూనియర్ ఎన్టీఆర్ శుక్రవారం రాత్రి ఈగ ఆడియో ఫంక్షన్లో వాడుతూ ఈగపై ఇంతెత్తున లేచాడు.
స్టేజిపైకి వెళ్లిన జూనియర్.. విలన్‌ను ఈగ ఎలా చంపుతుందని యాంకర్ సుమ ప్రశ్నించగానే.. చేతిలో మైకు పట్టుకుని ఒక్క ఉదుటున పరుగెత్తుకుంటూ వెళ్లి ఈగ వేషధారుడిపైకి ఉరికి.. దీని య... ఈ ఈగ రెండేళ్లుగా పెంట పెట్టింది. దీన్ని చంపితే పీడా వదులుద్ది.
ఈ ఈగ వల్ల రాజమౌళితో సినిమా చేద్దామనుకుంటే రెండేళ్లు తినేసింది. ఇంకా క్యూలో మరికొంతమంది హీరోలున్నారు. దీంతో ఎలా.. చంపేస్తా.. చంపేస్తా అంటూ ఈగపైకి ఉరికాడు జూనియర్ ఎన్టీఆర్.
దీంతో స్టేజిపై ఉన్న రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్‌ను గట్టిగా పట్టుకోవడం.. ఈగ గడగడా వణికిపోవడం జరిగింది. ఇది వారికి ఎలా అనిపించినా చూసినవారికి మాత్రం కాస్త 'పెంట'లానే ఉన్నదనీ, జూనియర్ ఎన్టీఆర్ అతిగా చేశాడనీ అనుకోవడం వినిపించింది. అందుకనే ఏమోగానీ దాసరి నారాయణ రావు ఆ తర్వాత మాట్లాడుతూ.. ఈమధ్య ఆడియో ఫంక్షన్లకు రావాలంటేనే చికాకేస్తుందంటూ సెలవిచ్చారు.
ఏం చేస్తాం... హీరోలు కదా.. వారేం మాట్లాడినా మాస్.. భరించాల్సిందే..!!

| Share with Friends : |
| Share with Friends : |

Post a Comment