రవితేజ, తాప్సీ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘దరువు’. సౌండ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రం మే 4న విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసినట్లు నిర్మాత చెప్తున్నారు. చిత్ర విశేషాలను వివరించటానికి మీడియా సమావేశం నిర్వహించి నిర్మాత దర్శకుడు శివ మాట్లాడుతూ...అతను పక్కా మాస్. మనిషి మాస్క్ వేసుకున్న ట్రాన్స్‌ఫార్మర్‌లాగా పూర్తి ఎనర్జీతో ఉంటాడు. శత్రువులకు అతనంటే బెదురే. అతగాడు దరువేశాడంటే భూగోళం దద్దరిల్లాల్సిందే. ఈ తరహా మనస్తత్వంతోనే రవితేజ పాత్రను తీర్చిదిద్దాం అన్నారు. అలాగే కొంచెం యాక్షన్‌కి, ఇంకొంచెం సున్నితమైన భావోద్వేగాలకూ చోటుంటుంది. ఈ కొలతలతో మరో సినిమా సిద్ధమైపోతోంది. ఈసారి మాత్రం వినోదాల సౌండ్ ఎక్కువే. మాస్‌తో తీన్‌మార్ ఆడించే కథతో వస్తున్నారని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ..‘‘ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. పస్తుతం ఓ భారీ సెట్‌లో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 25 వరకు హైదరాబాద్, బెంగళూరుల్లో జరిగే షూటింగ్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఏప్రిల్‌లో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి, మే 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రవితేజకు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కథ ఇది. నూటికి నూరు పాళ్లు వినోదంతో రంగరించి ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు. బ్రహ్మానందం, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవినాష్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: శివ, ఆదినారాయణ, సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: వెట్రివేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి.

Post a Comment