.
Home » » నాగ్ 'ఢమరుకం' విడుదల తేదీ ఖరారు

నాగ్ 'ఢమరుకం' విడుదల తేదీ ఖరారు

Written By Hot nd spicy on Tuesday, 20 March 2012 | 10:22

నాగార్జున, శ్రీనివాస రెడ్డిల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఢమరుకం. ఈ చిత్రం ఏప్రియల్ 6 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా కనిపించనున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం స్పెషల్ ఎఫెక్టులు సమకూర్చుకునే పనిలో ఉంది. సోషియో ఫాంటసీ కావటంతో ఎక్కువ బడ్జెట్,ఎక్కువ గ్రాఫిక్స్ తో రూపొందుతోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగార్డున నాలుగు రకాల గెటప్స్‌లో కనిపిస్తాను. ఆయన పాత్ర వెస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడుతుంది. సరికొత్తగా, స్టయిలిష్‌గా ఉండే చిత్రం ఇది.''దాదాపు ఏడాదిగా శ్రీనివాసరెడ్డి ఒక తపస్సులా ఈ కథ తయారు చేశారు. వెంకట్, నాగార్జునగార్లకు ఈ కథ బాగా నచ్చింది. నిర్మాణ విలువలపరంగా గొప్ప స్థాయిలో ఉండే చిత్రం ఇది"" అని అచ్చిరెడ్డి అన్నారు. నాగార్జున, అనుష్క, ప్రకాష్‌రాజ్, సోనూ సూద్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, అలీ, రఘుబాబు, ఎమ్మెస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, ఆర్ట్: అశోక్, ఎడిటింగ్: గౌతంరాజు, డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger