నా చొక్కా విప్పితే ఒంటి నిండా మరకలే కనిపిస్తాయి. వాటిని చూసినప్పుడు ఇంట్లో ఒకటే తిట్లు. 'సాంకేతికత పెరిగింది. గ్రాఫిక్స్ వచ్చాయి. అలాంటప్పుడు అంతగా సాహసాలు చేయాల్సిన అవసరం ఏముందని నాన్నగారు, దాసరి నారాయణరావు అంకుల్ తరచూ మందలిస్తుంటారు. మరి అంత సాంకేతికత పెరిగినప్పుడు ఇతర సినిమాల్లో ఫైట్లు నాకెందుకు సహజంగా కనిపించవు అని ఎదురు ప్రశ్నిస్తూ తప్పించుకొంటుంటాను అంటున్నారు మంచు మనోజ్. తన తాజా చిత్రం 'మిస్టర్ నూకయ్య'ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...తన చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్ట్స్ కి ప్రాధాన్యత ఇచ్చానని చెప్తూ...కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలను చూసేందుకు సిద్ధమై రండి అన్నదే దాని అర్థం. అంతర్జాతీయ సాంకేతిక విలువలతో తెరకెక్కిన చిత్రమిది. అమెరికాలో ఉన్న తెలుగువాళ్లంతా... ఇదీ మా సినిమా అని పక్కవాళ్లకి చూపించేలా ఉంటుంది. ఇంకా ఎక్కువ విషయాలు చెబితే... మజా ఉండదు. అవన్నీ తెరపైనే చూడాలి అన్నారు.
ఇక తను ఫైట్స్ చేయాలనుకోవటానికి కారణం వివరిస్తూ... నాన్నగారి దగ్గర డబ్బు తీసుకెళ్లి పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేసి జీవితం గడిపేద్దామనే ఉద్దేశంతో నేను రాలేదు. అందుకే నా స్నేహితులతో కలిసి 'నేను మీకు తెలుసా?' అనే సినిమా చేశాను. అప్పుడు డబ్బు చాలకపోవడంతో నేనే సొంతంగా ఫైట్లు తెరకెక్కించాను. పైగా డూప్‌లు లేకుండా నేను కొన్ని సాహసాలు చేస్తుంటాను. వేరే ఫైట్‌మాస్టర్లయితే వాటికి అడ్డు చెబుతుంటారు. అది నాకు ఇష్టం ఉండదు. అందుకే ఆ బాధ్యత కూడా నేనే తీసుకొన్నా అన్నారు. ఇక 'మిస్టర్ నూకయ్య'లో మంచు మనోజ్ దొంగగా కనిపిస్తాడు..నూకయ్య ఒక అనాథ. సెల్‌ఫోన్ల దొంగ. చివరికి తన తప్పును ఎలా తెలుసుకొన్నాడు? జీవితంలో ఎలా ఎదిగాడు? అనే విషయాలతో సాగే చిత్రమే ఇది. మంచు మనోజ్ హీరోగా, కృతి కర్బందా, సనాఖాన్ హీరోయిన్లుగా రూపొందిన 'మిస్టర్ నూకయ్య' చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై డి.ఎస్. రావు నిర్మించారు. సినిమా 5 సమర్పిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు అని కన్నెగంటి.

Post a Comment