నమిత నటించిన ఓ తమిళ రొమాంటిక్ చిత్రం తెలుగులో 'మిడత' టైటిల్ తో అనువాదం అవుతోంది. లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై నైనాల సాయిరామ్ తెలుగులో 'మిడత' పేరిట విడుదల చేస్తున్నారు. కె.రాజేశ్వర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీరామ్, రగస్య, నాజర్, వివేక్, రాధారవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర విశేషాలను సాయిరామ్ చెబుతూ - 'ఇందులో నమిత వైవిధ్యభరితమైన పాత్ర చేసింది. గ్లామర్‌కి మాత్రమే కాకుండా నటనకు కూడా అవకాశం ఉన్న పాత్ర ఇది.
ఈ చిత్రకథ గురించి చెప్పాలంటే.. డబ్బు కోసం మోడలింగ్‌లోకి అడుగు పెట్టే నమిత ఓ కంపెనీ యజమాని అయిన శ్రీరామ్‌తో ప్రేమలో పడుతుంది. అతను పెళ్లి, పిల్లల గురించి మాట్లాడుతుంటే, ఈమె మాత్రం డబ్బు, హోదా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పైకి ఎదగడం కోసం నైతికంగా కిందికి దిగజారిపోతూ ఉంటుంది. ఈ మలుపులతో సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. త్వరలో పాటలను, ఏప్రిల్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం అని చెప్పారు.

Post a Comment