.
Home » » మర్యాదరామన్న ఇంట్లో 'గబ్బర్ సింగ్'

మర్యాదరామన్న ఇంట్లో 'గబ్బర్ సింగ్'

Written By Hot nd spicy on Tuesday, 20 March 2012 | 10:27

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్  షూటింగ్ కోకాపేటలో జరుగుతోంది. సునీల్ మర్యాద రామన్న  ఇంటి సెట్ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.  గబ్బర్ సింగ్ షూటింగ్ తుదిదశకు చేరుకుంది. మరోవైపు నిర్మాణ అనంతర కార్యక్రమాలు కూడా  జరుపుకుంటోంది. ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమౌతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.
ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ పతాకం పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తుండగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆడియో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చిత్ర నిర్మాత గణేష్ బాబు సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా పబ్లిసిటీ కూడా వినూత్నంగా చేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ సరసన అందాల తార శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం హిందీ దబాంగ్ కు రీమేక్. గబ్బర్ సింగ్ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పంజా నిరాశపరచటంతో పవన్ అభిమానుల ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger