.
Home » » 'సమ్మర్ 2012' తెలుగు సినిమాల లిస్ట్

'సమ్మర్ 2012' తెలుగు సినిమాల లిస్ట్

Written By Hot nd spicy on Wednesday, 21 March 2012 | 09:19

ఈ వేసవి తెలుగు ప్రేక్షకులను మరింత వేడిక్కించనుంది. వరస సినిమాలతో ధియోటర్స్ కిక్కిరసనున్నాయి. ఉగాది నుంచి ఈ సీజన్ ప్రారంభమవుతోంది. ఉగాది రోజున రానా,జెనీలియా నటించిన నా ఇష్టం చిత్రం విడుదల అవుతోంది. అదే రోజున శ్రీనివాస్,రేష్మి నటించిన ఈ రోజుల్లో విడుదల కానుంది. అలాగే సీతా వెడ్స్ శ్రీరామ్,చెలగాటం చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. ఈ వారం తర్వాత మార్చి 30న ధనుష్,శ్రుతి హాసన్ నటించిన 3 విడుదల కానుంది. కొలావడి డీ పాటతో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం రైట్స్ ని నట్టికుమార్ సొంతం చేసుకున్నారు. అదే రోజున ఆర్పీ పట్నాయిక్ చిత్రం ప్రెండ్స్ బుక్ కూడా విడుదల అవుతోంది.

ఇక ఏప్రియల్ లో తేజ ...నీకు నాకు డాష్ డాష్ చిత్రం విడుల అవుతోంది. రామ్ చరణ్ రచ్చ.. అదే నెలలో అంటే ఏప్రియల్ 12 న విడుదల అవుతోంది. ఆ తర్వాత వారం..ఎన్టీఆర్ దమ్ము రిలీజ్ అవుతోంది. మరో ప్రక్క ఎన్టీఆర్ బాబాయ్..బాలకృష్ణ అధినాయకుడు సైతం ఏప్రియల్ లో విడుదల అవుతోంది. ఇక ఏప్రియల్ నెలాఖరులో రాజమౌళి ఈగ విడుదల అవుతోంది.

మే మొదటి వారంలో రామ్,తమన్నా కాంబినేషన్ లో కరుణాకరన్ రూపొందించిన ఎందుకంటే ప్రేమంట విడుదల అవుతోంది. అలాగే రవితేజ,తాప్సీ ల దరువు కూడా ఏప్రియల్ రెండవ వారంలో ప్లాన్ చేస్తున్నారు. అలాగే గబ్బర్ సింగ్ కూడా మే 9న విడుదల అవుతోంది. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా మే చివర వారంలో విడుదల అవుతోంది. నాగార్జున ఢమురకం, ప్రభాస్ రెబెల్ కూడా అదే నెలలో విడుదల అవుతోంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger