దూకుడు, బిజినెస్‌మేన్ హిట్లతో దూసుకుపోతున్న మహేష్ బాబుకు ఆయన అభిమానులు ప్రిన్స్ స్థానంలో సూపర్ స్టార్ అనే బిరుదును తగిలించేశారు. ప్రిన్స్... సూపర్ స్టార్ అయితే మెగా అభిమానులు ఊరుకుంటారా..? ఏం చేస్తారేంటి.. అనేగా మీ సందేహం...
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజను ఆయన అభిమానులు మెగా పవర్ స్టార్ అని పిలుచుకోవడం మనకు తెలిసిందే. కానీ మహేష్ బాబు సూపర్ స్టార్ అని పిలుపించుకుంటున్న నేపధ్యంలో తమ అభిమాన రామ్ చరణ్ బిరుదును కూడా కాస్త అప్‌గ్రేడ్ చేస్తామంటున్నారట ఫ్యాన్స్.
అదేంటయా.. అంటే... చిరంజీవి సంపాదించుకున్న మెగాస్టార్ బిరుదును రామ్ చరణ్ తేజకు తగిలించేందుకు రంగం సిద్ధం చేశారట. త్వరలో విడుదల కాబోతున్న రచ్చ సినిమా టైటిల్స్‌లో మెగాస్టార్ రామ్ చరణ్ నటించిన... అని వేయనున్నారట. అంతా బాగానే ఉంది... మరి చిరంజీవి మెగాస్టార్‌ను రామ్ చరణ్ తన్నుకపోతే.. మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్న చిరంజీవి పేరు ముందు ఏ బిరుదు తగిలించాలి..?! అప్పటికి ఏదేని మంత్రి పదవి వస్తే అది తగిలిస్తారేమో..?!!

Post a Comment