.
Home » » 'రచ్చ' ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లో కాదు

'రచ్చ' ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లో కాదు

Written By Hot nd spicy on Tuesday, 7 February 2012 | 19:22

రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'ఆడియో విడుదల హైదరాబాద్ లో చేయటం లేదు. ఈ పంక్షన్ ని గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో .. కర్నూల్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొదట వారు తిరుపతిలో ఆడియో విడుదల అనుకున్నారు కానీ అక్కడ రామ్ చరణ్ వివాహ రిసెప్షన్ పెట్టుకోవటంతో ఇలా మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ఆడియో విడుదల చేస్తారు. అలాగే ఈ చిత్రాన్ని మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఒక పాటను నెట్ లో లీక్ చేసారు. ఆ పాట అందరి అభిమానాన్ని చూరగొంటోంది.మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు.

ఈ సాంగ్ ఇలా సాగుతుంది..."సైలెంట్ చూపులోడు...వైలెంట్ చేతలోడు ...కరెంట్ కండలోడు..హీ ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ ...రచ్చ...అడుగేస్తే సీడెడ్..ఆంధ్రా..నైజాం..రచ్చ...వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ..హీఈజ్ గోయింగ్ టుబి ఎ మెగాస్టార్...హీఈజ్ గోయింగ్ టు బి ఎ గెగా స్టార్.. హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ యుగా స్టార్..అంటూ మాస్ బీట్ తో ఈ సాంగ్" సాగుతుంది. ఈ సాంగ్ లో...బాలీవుడ్ లో'రాస్కెల్స్‌','ఆయేషా'చిత్రాలలో హీరోయిన్ గా చేసిన లీసా హైడెన్‌ రామ్ చరణ్ తో డాన్స్ చేస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చగా ఆ గీతాన్ని తెరకెక్కించారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరమ్ మెడికోగా కనిపించనున్నారు. కారు రేసుల బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. అందులో రామ్ చరణ్ పేరు విశ్వం. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger