‘కొలవెరి’ సాంగుతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ అదే జోష్‌తో బాలీవుడ్‌లో పలు అవకాశాలు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలో ఓ బాలీవుడ్ సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. అంతే కాకుండా సచిన్ కోసం ఓపాటను కంపోజ్ చేసే అవకాశం కూడా లభించింది ఈ యువ హీరోకి. సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ‘బూస్ట్’ హెల్త్ డ్రింక్ యాడ్ కోసం ధనుష్ ఓ పాటను స్వయంగా రాసి కంపోజ్ చేశాడు. ‘One plus one two-u two-u, if not sachin who-u who-u!!!” అంటూ ఈ సాంగు సాగుతుంది. సచిన్ కోసం ఈ పాట కంపోజ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందదని, రామోజీ ఫిల్మ్ సిటీలో ఇందుకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోందని ధనుష్ చెప్పుకొచ్చారు.
తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో రాబోతున్న ‘3’ సినిమాకుగాను ‘కొలవెరి’ అనే పాటను రాసి, దాన్ని స్వయంగా పాడిన విషయం తెలిసిందే. సూపర్ పాపులర్ అయిన ఈ సాంగు అతితక్కువ కాలంలో కోట్లాది క్లిక్స్ తో మోస్ట్ వ్యూవుడ్(గోల్డ్) లిస్టులో చేరింది. భారతీయ సినీ చరిత్రలో ఓ సినిమా పాట, అందులోనూ హీరో పాడిన దానికి ఇంత పెద్ద మొత్తంలో హిట్స్ రావడం బహుషా ఇదే తొలి సారి కాబోలు.
ఈ పాటలో ఉన్న మహత్యం ఏమోగానీ....దేశ వ్యాప్తంగా ఈ పాటకు వెర్రిక్కిన వాళ్లలా అభిమానులైపోయారు చాలా మంది. అందుకే మీడియాలో ఈ పాటను కొల ‘వెర్రి’గా అభివర్ణిస్తున్నారు. ఈ పాట ఇంత పెద్ద హిట్ కావడంతో ‘3’ సినిమా విజయంవంతం అవడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే ఈ సినిమాను సొంతం చేసుకోవడానికి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారట. సినిమా ఎలా ఉన్నా... ఆ పాట కోసం అయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారంతా..

Post a Comment