జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దమ్ము’ చిత్రం ఆడియో ఉగాది సందర్భంగా మార్చిన 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దమ్ము యూనిట్ సభ్యల నుంచి తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియోను అంతకంటే ముందుగా మార్చి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఊసరవెల్లి తర్వాత తమ అభిమాన హీరో సినిమా గురించి ఎదురు చూస్తున్న అభిమానులకు....దమ్ము ఆడియో అనుకున్న దానికంటే ముందుగానే విడుదల చేయడం శుభవార్తలాంటిదే.
ప్రస్తుతం దమ్ముచిత్రం షూటింగ్ గత కొన్ని రోజులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతోంది. నందమూరి ఫ్యామిలీకి సింహా లాంటి భారీ విజయాన్ని అందించిన బోయపాటి శ్రీను ‘దమ్ము’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈచిత్రం తర్వాత జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ చిత్రం చేయబోతున్నారు. కాజల్ అగర్వాల్ నమార్చి 18 పూజా కార్యక్రమం, ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్కు పూర్తి చేశారు. దూకుడు సినిమాకు పని చేసిన సాంకేతిక బృందం మొత్తం ‘బాద్ షా’ చిత్రానికి పని చేయనున్నారు. సినిమా మొత్తం యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు.

Post a Comment