విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ ‘షాడో’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లాంచనంగా ప్రారంభం అయింది కూడా. వెంకటేష్ ఇందులో డాన్ పాత్రలో కనిపించనున్నాడు. వెంకీ సరసన తాప్సీ లీడ్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ ముఖ్య పాత్రను పోషిస్తుండగా అతనికి జోడీగా మధురిమ నటిస్తోంది.
వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ హన్సికను సెకండ్ హీరోయిన్‌గా తీసుకోవాలని చూశారు. అయితే తన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో రిజక్ట్ చేసినట్లు సమాచారం. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయడం నాకెంతో ఇష్టం, ఆయనంటే నాకు అభిమానం అని హన్సిక గతంలో ప్రకటించింది. బిల్లా సినిమాలో కూడా కేవలం మెహర్ రమేష్ కోసమే ఐటం సాంగు చేసింది. అయితే ఈసారి వేరే సినిమాలకు కమిట్ అవ్వడం, అదే సమయంలో ‘షాడో’ చిత్రానికి డేట్స్ ఇవ్వాల్సి రావడంతో రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి అని తన సన్నిహితుల వద్ద వాపోతోంది హన్సిక.
హన్సిక ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సూర్య హీరోగా వస్తున్న సింగం సీక్వెల్ లో కూడా హన్సిక లీడ్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మరో వైపు తెలుగులో మంచు విష్ణు సరసన ‘దొరకడు’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది.

Post a Comment