దేశంలోనే రెండో అతిపెద్ద చిత్ర పరిశ్రమ (బాలీవుడ్ తర్వాత)గా చెప్పుకునే తెలుగు చనల చిత్ర పరిశ్రమకు గత యేడాది దక్కిన విజయాలు వేళ్లమీద లెక్కించవచ్చు. అగ్రహీరోలతో పాటు.. కుర్రకారు హీరోల చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయితే, 2011 సంవత్సరాంతంలో టాలీవుడ్ 'ప్రిన్స్' మహేష్ బాబు "దూకుడు" చిత్రం బాక్సాఫీస్ హిట్ కొట్టింది.
2011 యేడాది చివర్లో లభించిన హిట్.. 2012 ప్రారంభం నుంచి కొనసాగుతోంది. ఇప్పటి వరకు విడుదలైన నాలుగు చిత్రాలు మంచి హిట్‌ను సాధించాయి. సంక్రాంతికి విడుదలైన "బిజినెస్‌మేన్" చిత్రం మహేష్ బాబుకు మరో మంచి విజయాన్ని అందించింది.
ఆ తర్వాత టాలీవుడ్ కమెడియన్ కమ్ హీరో సునీల్ హీరోగా వచ్చిన చిత్రం "పూలరంగడు". ఈ చిత్రం కూడా ప్రేక్షకాధారణ పొందింది. ఈ రెండు చిత్రాల తర్వాత సిద్ధార్థ్ హీరోగా వచ్చిన "లవ్ ఫెయిల్యూర్", నితిన్ హీరోగా నటించిన "ఇష్క్" చిత్రాలు కూడా మంచి సక్సెస్‌ను మూటగట్టుకున్నాయి.
ఈ నలుగురు హీరోల్లో మహేష్ బాబు, సునీల్ మినహా... సిద్ధార్థ్, నితిన్‌లు విజయం కోసం కొన్నేళ్ళ పాటు అహర్నిశలు శ్రమించాల్చి వచ్చింది. ముఖ్యంగా సిద్ధార్థ్‌ను హీరోగా పెడుతూ చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలెవ్వరూ ముందుకు రాకపోవడంతో స్వయంగా నిర్మాత అవతారమెత్తారు.
తన సొంత బ్యానర్‌పై అతి తక్కువ బడ్జెట్‌తో బాలాజీ మోహన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన "లవ్ ఫెయిల్యూర్" మంచి విజయాన్ని సాధించడమే కాకుండా సిద్ధార్థ్‌కు మంచి బ్రేక్ ఇచ్చినట్టు అయింది.
అలాగే, విజయం కోసం మొహం వాచిపోయిన మరో యువ హీరో నితిన్. 2004లో విడుదలైన "సై" చిత్రం తర్వాత విజయమెలా ఉంటుందో మరచిపోయాడు. ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన దాదాపు 13 చిత్రాలు అపజయం పాలయ్యాయి. అయితే, తాజాగా విడుదలైన "ఇష్క్" చిత్రంతో విజయాన్ని రుచిచూశారు.
ఇలా 2012 సంవత్సరంలో టాలీవుడ్‌కు వరుసగా నాలుగు హిట్లు లభించడంతో తర్వాత వచ్చే చిత్రాలపైనా భారీ అంచనాలే పెరిగాయి. ఐతే విక్టరీ "బాడీగార్డ్"... రవితేజ "నిప్పు" నిరాశ మిగిల్చినప్పటికీ మొత్తం మీద.. ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమ 'మూడు పువ్వులు.. ఆరు కాయలు'గా ఉంటుందని పలువురు సినీ పరిశ్రమ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment