టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అనుష్క గత సంవత్సరం ఒక్క చిత్రంలో కూడా నటించలేదంటే విచిత్రమే మరి. ఆ మధ్య మహేష్‌బాబు కూడా ఇదే విధంగా ఒక సంవత్సరమంతా ఎక్కడా కనబడకుండా ఒక్కసారిగా ‘దూకుడు’తో రెచ్చిపోయాడు. అలాగే అనుష్క కూడా రాబోయే ‘ఢమరుకం’, ప్రభాస్ చిత్రాలతో ప్రభంజనం సృష్టిస్తుందేమో చూడాల్సిందే. గత సంవత్సరం ఆమె నటించిన ‘నాన్న’ అనే డబ్బింగ్ చిత్రం ఒక్కటే విడుదలైంది. ఆ చిత్రం చూసే అభిమానులు సంతృప్తి పడ్డారు.
ఈ సంవత్సరమైనా నాలుగైదు చిత్రాలలో కనిపించాలని వారు కోరుకుంటున్నారు. వారి సినీ దేవత కరుణిస్తుందో లేదో మరి! ఈ విషయమే అడిగితే కాల్షీట్ల ప్రకారం ఒప్పుకున్న చిత్రాలు వరుసగా చేసుకుంటూ వెళ్లడమే నా పని అంటోంది. ఎంత కాల్షీట్లయినా అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా!

Post a Comment