సామాన్యులే కాదు.. హీరోలకు పెండ్లిళ్ళ సీజన్ ఉందని ఈ ఏడాది నిరూపించబోతుంది. ఎప్పటినుంచో అనుకుంటున్న రామ్‌చరణ్ పెండ్లి.. జూన్‌లో హైదరాబాద్‌లో జరుపనున్నట్లు నిన్న తిరుపతికి వచ్చిన ఆయన మామగారు అపోలో చైర్మన్ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. రామ్‌చరణ్, ఉపాసన చక్కటి జంటగా ప్రశంసించారు. రథసప్తమినాడు... ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
జూన్‌లో రామ్‌చరణ్ ఓ ఇంటివాడవుతుండగా గోపీచంద్ కూడా పెళ్లాడబోతున్నాడు. తనతో సినిమాలు తీసే భవ్య సిమెంట్ అధినేత కుమార్తెతో వివాహమని పుకార్లు వచ్చాయి. కానీ అవేవీకాకుండా.. ఆంధ్రకు చెందిన పారిశ్రామికవేత్త కుమార్తెను ఆయన వివాహమాడనున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రాంబాబు కుమార్తె హరితను వివాహం చేసుకోనున్నాడు. ఈనెల 26న పెళ్లికుమార్తె ఇంట్లో నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 24న తెల్లవారుజాము 3.36ని. హైటెక్స్ సిటీలో పెండ్లి జరగనుంది. హరిత ఆస్ట్రేలియాలో ఎం.బి.ఎ. పూర్తిచేసింది.
దివంగత ఇవి.వి. సత్యనారాయణ పెద్దకుమారుడు ఆర్యన్ రాజేష్ వివాహం ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 10న సుభాషణి మెడలో మూడుముళ్లు వేయనున్నారు. తూర్పుగోదావరి జేగురుపాడులో రథసప్తమినాడు నిశ్చితార్తం వైభంగా జరిగింది. ఆల్రెడీ ఇవివిగారు బతికున్నప్పుడే జరగాల్సి ఉంది. కొద్దిరోజుల్లో నిశ్చితార్థం జరుగనుందనగా ఆయన స్వర్గస్తులైనారు. ఈ నిశ్చితార్థానికి రాజేష్ తల్లి సరస్వతి, సోదరుడు అల్లరి నరేష్‌తోపాటు పలువురు బంధువులు హాజరయ్యారు. రాజేష్ వివాహం రాజమండ్రిలో జరగనుంది. పెండ్లి తర్వాత రాజేష్ ఇవివి నిర్మాణ సంస్థను పర్యవేక్షించనున్నారు.
రీమాసేన్ ప్రేమ వివాహం
'చిత్రం'తో అందరికీ తెలిసిన రీమాసేన్ కూడా పెండ్లికూతురు కాబోతుంది. ఢిల్లీకి చెందిన శివ్కరణ్ను ఆమె వివాహం చేసుకోబోతుంది. మార్చి 11న వ్యవసాయక్షేత్రంలో పెండ్లి. పంజాబీ, బెంగాలీ సంప్రదాయాల్లో వివాహ కార్యక్రమం ఉంటాయని రీమా సన్నిహితులు తెలియజేస్తున్నారు.
మరో ప్రేమవివాహం కూడా త్వరలో జరగనుంది. జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడనుంది. ఇటీవలే సిసిఎల్ క్రికెట్ మ్యాచ్‌లో చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. వీరిద్దరి పెండ్లిని అత్యంత వైభవంగా చేసేందుకు పెద్దలు సన్నాహాలు చేస్తున్నారు.

Post a Comment