మహేష్‌బాబు కెరీర్ దూకుడు నుంచి ఒక్కసారిగా దూసుకుపోతోంది. బిజినెస్‌మేన్ చిత్రం మరింత క్రేజ్ సంపాదించి పెట్టింది. రెండు హిట్లు తర్వాత మళ్ళీ అంతటి సక్సెస్ కోసమే ప్రేక్షకులు ఎదురు చూస్తారు. దాన్ని ఎలా బ్యాలెన్స్ వేసుకోవాలని చూస్తున్నాను అంటున్నారు మహేష్‌బాబు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులు....
బిజినెస్‌మేన్ కథ వినకుండా చేయడం మొండి ధైర్యమా?
అదేంకాదు. అప్పుడు దూకుడు డబ్బింగ్ చెప్పడం వల్ల వినే సమయం దొరకలేదు. పోకిరి నుంచి పూరీ జగన్నాథ్ స్టైల్ నాకు తెలుసు. ఆయనపై పూర్తి నమ్మకం ఉంది. ఆయనకూ మంచి సక్సెస్ కావాలి. పోకిరి కాంబినేషన్ కదా.. చాలా జాగ్రత్తగా తీస్తాడనే భరోసా ఉంది. ఈ చిత్రానికి సంభాషణలు హైలైట్‌గా అవుతాయి అని ఆనాడే చెప్పారు.
సంభాషణల వల్ల సినిమా హిట్ అవుతుందని అనుకున్నారా?
సింపుల్‌గా ఉండే సంభాషణలు తప్పకుండా ఆదరిస్తారు. నేను ఎక్కువగా డైలాగ్స్ ఈ సినిమాకే చెప్పాను. దాన్ని ఆయన బాగా డీల్ చేశాడు.
మాఫియా డాన్‌కు కొత్త వ్యాపారం ఈ చిత్రం ద్వారా చూపించారు?
ఇది సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీశాను. దాన్ని ఆ కోణంలోంచే చూడాలి.
కలెక్షన్ల హైప్ చేయడం వల్ల ఐటీదాడులు జరిగే అవకాశం ఉంది? పైగా మీరు సినిమాలో చూపించినట్లు మోసపు దాడులు జరిగితే?
(పెద్దగా నవ్వి..) అవును.. ఐటీ దాడులు జరిగే అవకాశముంది. ఒక వారంలో జరగవచ్చు... కానీ సినిమాల్లోగా బ్లఫ్ ఐటీ దాడులు జరిగితే.. నా దగ్గర తీసుకెళ్లడానికి ఏమీలేవు. ఒట్టి న్యూస్ పేపర్లే...
విజయోత్సవ సభలో అటు దాసరి, ఇటు రామ్‌గోపాల్‌వర్మ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేశారు?
వారికి నేనంటే అభిమానం వల్ల అలా చెప్పారు.. దాసరిగారు లెజెండ్.. ఆయన నన్ను చూసిన పరిశీనలో అలా అన్నారు. వర్మగారు నన్ను అమితాబ్ కంటే ఎక్కువగా పోల్చారు. నిజానికి ఆయనకు ఎవ్వరూ సాటిరారు. ఒకవేళ వర్మ చెప్పినట్లు... ఇండియాలో నేనే నెంబర్ 1 అని నేను నమ్మితే.. నాకంటే ఫూల్ మరొకడు ఉండడు.
ప్రతి హీరో ఇతర హీరోల ఫంక్షన్లకు హాజరవుతారు. మీరు మాత్రం?
అవును. నాకెందుకో మొదట నుంచీ అలా అలవాటు లేదు. అలా అని ఇతర హీరోలతో మంచి సంబంధాలున్నాయి. నా సినిమాకు మాత్రం నేను తప్పకుండా హాజరు కావాలి.
మీతో హీరోయిన్ చేశాక... వదినగా చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలిసింది?
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లుకు ఒక హీరోయిన్ అనుకున్నాను. ఆమె నాతో హీరోయిన్‌గా చేసింది. నా అన్న పాత్ర వెంకటేష్ చేస్తున్నారు. ఆయనకు భార్యగా నటిస్తే నాకు వదినేకదా... ఇదంతా ఫైనల్ కాలేదు. అలా అనుకుంటున్నారంతే... ఎవరో ఒకరు నటిస్తారు.
శ్రీనువైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరు మిమ్మల్నిమార్చారు?
నన్ను ఎవరూ మార్చలేదు. నేను ప్రతి దర్శకుడిలోనూ కొత్త కోణాన్ని చూస్తాను. నాకు నేనుగా మారతాను.
మీరు క్రికెట్ ఆడరెందుకు?
చిన్నప్పుడు ఆడేవాడిని. ఇప్పుడు ఆడే టైంలేదు.
ఖాళీ టైమ్‌లో ఏం చేస్తారు?
కుటుంబంతో గడపటమంటే ఇష్టం. లేకపోతే సినిమాలు చూస్తుంటాను.
మీకు నచ్చిన పుస్తకం ఏమిటి?
నేను గతంలో సిగరెట్లు తెగ తాగేవాడిని. కానీ.. స్మోకింగ్ వల్ల అనర్థాలు అనే ఓ ఆంగ్ల పుస్తకాన్ని చదివాను. దాంతో మొత్తం సిగరెట్లు మానేశాను అని ముగించారు.

Post a Comment