మామూలుగా మన సినిమా ఆడియో ఫంక్షన్లకు సుమకానీ, ఝాన్సీకానీ, ఉదయభానుకానీ ఎక్కువగా యాంకరింగ్ చేస్తుంటారు. అయితే త్వరలో జరిగే ఓ ఆడియో ఫంక్షన్‌కి ఓ పెద్ద దర్శకుడు యాంకరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనే పూరి జగన్నాథ్ ! మహేష్‌బాబు, కాజల్ జంటగా పూరి డైరెక్షన్లో రూపొందిన ‘ది బిజినెస్‌మేన్’ సినిమా ఆడియో వేడుక ఈ నెల 22న జరగనుంది. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు సంబంధించిన పాటలను ఆ రోజు ఒకే వేదికపై విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేయాల్సిందిగా పూరి జగన్నాథ్‌ను మహేష్ కోరాడట. దాంతో ఆయన కాదనలేక ఒప్పుకున్నాడని, ఇప్పటి నుంచే రిహార్సల్స్ కూడా చేస్తున్నాడని అంటున్నారు. ఈ వార్తలో ఎంతటి నిజముందో త్వరలోనే తెలుస్తుంది.
Home »
» బిజినెస్ మాన్ ఆడియో ఫంక్షన్లో యాంకర్ గా పూరి!

Post a Comment