దక్షిణాది చిత్రాల్లో మంచి ఫామ్ ఉన్న సమయంలో బాలీవుడ్ కొండలుచూసి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది శ్రీయ. తీరా అక్కడికి వెళ్ళాక ఆ కొండలు చాలా ఎత్తుపల్లాలని అర్థమయ్యేసరికి ఇక్కడ అవకాశాలన్నీ జారిపోయాయి. అక్కడ ఫ్లాప్ స్టార్‌గా ముద్రవేయిచుకొని మళ్లీ దక్షిణాదికి వచ్చేసింది శ్రీయ. చివరికి ఐటెమ్ సాంగ్‌లు చేయడానికి కూడా సిద్ధమైంది. అనుకోని విధంగా నితిన్ మన్మోహన్ నిర్మిస్తున్న ‘గల్లీ గల్లీమే చోర్ హై’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ అవకాశంతో బాలీవుడ్‌లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేస్తానంటుంది. బాలీవుడ్‌లో ఇప్పుడుచేస్తున్న సినిమా హిట్ అయినా సౌత్‌లో మళ్లీ హవా మొదలౌతుంది. అయితే బాలీవుడ్‌లో చిత్రమన్నా విడుదలవ్వాలి లేదా దక్షిణాదిలో మరో హిట్టన్నా దొరకాలి. అప్పుడు గానీ శ్రీయ మళ్లీ ఫామ్‌లోకి రాదు. కానీ ఇది సాధ్యమయ్యే పనేనా అని సినీ పండితులు లెక్కలువేస్తున్నారు. చూద్దాం! బాలీవుడ్ అయనా శ్రీయను ఆదుకుంటుందేమో!
Home »
» శ్రియ బాలివుడ్ రీఎంట్రీ

Post a Comment