విద్యా బాలన్ హీరోయిన్‌గా నటించిన ‘ద డర్టీ పిక్చర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి రెండు వారాల్లోనే రూ. 70 కోట్ల షేర్ సాధించి, సంచలనం సృష్టించింది. టాప్ బాలీవుడ్ హీరోల సినిమాల తరహాలో ఈ సినిమా చేస్తున్న కలెక్షన్ల మ్యాజిక్‌కి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. రూ. 70 కోట్లలో తొలి వారం వసూళ్లే రూ. 52 కోట్లు కావడం గమనార్హం.
నజీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మి, తుషార్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మిలన్ లూథ్రియా దర్శకుడు. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రంలో విద్య పోషించిన రేష్మ పాత్ర, ఆ పాత్రలో ఆమె నటన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఇప్పుడు కేవలం బాలీవుడ్ మాత్రమే కాక దేశవ్యాప్తంగా యువతరం ఆరాధ్య తారగా మారిపోయింది విద్య.

Post a Comment