మెగాస్టార్ అంటూ చిత్రరంగంలో పిలుచుకునే చిరంజీవి పార్టీ పెట్టి.. కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడి. మళ్లీ అదేకాంగ్రెస్‌లో కలవడం ఒక భాగం. అయితే ఇటీవలే కాంగ్రెస్‌వారు ప్రజారాజ్యంపార్టీవారిని చాలా చులకన చూస్తున్నట్లు కలత చెందారు కూడా. ఇది మొదట్లో ఊహించారు కొందరు సినీమేథావులు. ఇప్పుడు వారే రాజకీయాలు వద్దంటూ.. సినిమావైపు కన్నువేయమని సలహాకూడా ఇచ్చారు. దాంతో తన 150వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీయాలని కంకణం కట్టుకున్నారు. దీనికి రచయితలుగా ఎవరైతేబాగుంటుందో అని మరో మాట లేకుండా పరుచూరి బ్రదర్స్‌కు అవకావం కల్పించారు. వారు ఏడాదినాడు చెప్పిన ఓ స్వాతంత్య్ర సమరయోధుని కథను మళ్లీ తుదిమెరుగులుదిద్ది…ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా మార్చి తయారుచేస్తున్నారు. బుధవారం కథా చర్చలు మళ్లీ జరిగినట్లు పరుచూరి బ్రదర్స్ ధృవీకరించారు. చిరంజీవి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ, చిరంజీవి ఈ చిత్రంలో కొత్తగా కన్పిస్తారని చెబుతున్నారు. అదెలావుంటుందో వెయిట్ అండ్ సీ.
Home »
» సిద్ధమవుతున్న మెగాస్టార్ 150 వ చిత్రం
Post a Comment